20-04-2025 NORMAL NEWS 10:44 PM
swarnodayam.com
Telugu Daily News
20-04-2025 10:44 PM By Mandala Yadagiri

కల్వరి టెంపుల్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

కల్వరి టెంపుల్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు
IMG-20250420-WA0175

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలములోని రంగాపూర్ లో గల కల్వరి టెంపుల్ లో ప్రతి సంవత్సము మాదిరిగానే ఈ సంవత్సరం కుడా గొప్పగా ఈస్టర్ వేడుకలు జరిగాయి. ఫాదర్ నెల్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు దైవ సందేశం అందించుటకు ప్రత్యేక అతిధులుగా పాస్టర్ కొమ్మగళ్లు డేనియల్ హాజరై ప్రతేక పాటలతో సంఘ సభ్యులను బలపరిచి దైవ సందేశం అందించారు. యేసు క్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి ఆదివారం సమాధి నుండి లేవడమే ఈస్టర్ అంటారని దీనిని క్రైస్తవులు ప్రపంచమంతా గొప్ప పర్వ దినంగా, పండుగ దీనంగా జరుపుకుంటారని ఈ రోజు క్రైస్తవులు కలిగిన దానిలో నుండి ఇతరులకు అన్నదానం గాని వస్త్ర దానం గాని చేస్తారని తెలిపారు. క్రీస్తు జీవిత త్యాగాన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు ప్రేమ, శాంతి, దయ, కరుణ గుణాలను అలవర్చుకొని జీవించాలని బోధించారు. అనంతరం సంఘ సభ్యులు బొడ్డు మంజుల, బొడ్డు కల్పన ప్రత్యేంకంగా తయారు చేయించిన కేక్ ను అతిధి స్పీకర్ డేనియల్ ఫాదర్ నెల్సన్ – సుదిన దంపతులు మరియు సంఘ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. కేక్స్ తో పాటు నాగార్జున – కవిత దంపతులు మరియు బొడ్డు కోమల కుటుంబాలు సమోసాలు అందరికి పంచి పెట్టారు. కరీంనగర్ నుండి కేసి ప్రేమ్ కుమార్ – షీలా దంపతులు సంఘ సభ్యులకు పదిమందికి చీరలు పంపించగా వాటిని ఫాదర్ నెల్సన్ చేతుల మీదుగా పేదవారికి పంపిణీ చేశారు.

ప్రత్యేకంగా తయారుచేసిన కేకును కట్ చేస్తున్న పాస్టర్, అతిథులు, సంఘ సభ్యులు..
పాస్టర్ నెల్సన్ సుధీన దంపతులను సన్మానిస్తున్న సంఘ సభ్యులు
అతిథిని సత్కరిస్తున్న పాస్టర్ నెల్సన్ దంపతులు..
Oplus_131072
Oplus_131072
పేదలకు చీరలు పంపిణీ చేస్తున్న పాస్టర్ డాక్టర్ నెల్సన్
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!