Social 1080×1350 • Multi-page
21-04-2025 BREAKING NEWS 05:27 PM
swarnodayam.com
Telugu Daily News

పెద్దపాపయ్యపల్లి గ్రామంలో వడగాల్పులకు కుప్పకూలిన రేకుల షెడ్డు..గుండేటి సరిత కుటుంబానికి అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.

పెద్దపాపయ్యపల్లి గ్రామంలో వడగాల్పులకు కుప్పకూలిన రేకుల షెడ్డు..గుండేటి సరిత కుటుంబానికి అండగా ఉంటానన్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.
IMG_20250421_172436

– ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు.

– ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి ఇస్తానని హామీ ఇచ్చిన ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 21: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గుండేటి సరిత-శివలకు చెందిన రేకుల షెడ్డు ఈదురు వడగాలులకు కుప్ప కూలింది. దీంతో గ్రామస్తులు అందించిన సమాచారంతో స్పందించిన అధికారులు సోమవారం ఉదయం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడతల ప్రణవ్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పకూలిన రేకుల షెడ్డును సందర్శించారు. పూర్తిగా దగ్ధమైన రేకుల షెడ్డును కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ కు వివరించి చెప్పడం జరిగింది. విషయం తెలుసుకున్న ప్రణవ్ ఫోన్ ద్వారా బాధితురాలతో మాట్లాడి మీకు అండగా ఉంటానని, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రమాదం జరగడానికి గల కారణాలను బాధితురాలిను, స్థానికులను ప్రణవ్ అడిగి తెలుసుకున్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న గుండేటి సరిత-శివ కుటుంబం ఇల్లు కుప్పకూలడంతో ఏమి తోయని స్థితిలో ఉన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున, నా తరఫున అన్ని విధాలా ఆదుకుంటానని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడతల ప్రణవ్ హామీ ఇచ్చారు. ఇంటి స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుల్ల రాధ, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు ఉమాపతిరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ యండి చాంద్ పాషా, బండారి సదానందం, సమ్మెట సంపత్, పెద్ద పాపయ్యపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోషు రాజమౌళి, ఇంద్రసేనారెడ్డి, కృష్ణమూర్తి, రాజమౌళి, తలకొక్కుల రవి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!