22-04-2025 NORMAL NEWS 06:36 PM
swarnodayam.com
Telugu Daily News
22-04-2025 06:36 PM By Mandala Yadagiri

సత్తాచాటిన హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

సత్తాచాటిన హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
IMG-20250422-WA0104

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరపు ఫలితాలు హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం చాటారు. కళాశాల ఏర్పడిన నుండి ఇప్పటివరకు ఎంపీసీ, బైపిసి, సీఈసీ, HEC లలో ఊహించనీ ఫలితాలను సాధించడం జరిగిందనీ కళాశాల ప్రిన్సిపల్ వి ఆంజనేయరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి సంవత్సరంలో ఎంపీసీ నుండి రాష్ట్రస్థాయి మార్కులను కే అభిరామ్ 463/470, బి శ్రావణి 446/470, పి అభిరామ్443/470, ఆర్ వర్షిత 416/470 లు సాధించారన్నారు. బైపిసిలో జే మాధవి 379/440 అత్యున్నత మార్కులు సాధించడం జరిగిందన్నారు. సిఇసిలో పి అర్చన 386/500 అదేవిధంగా HECలో టి అఖిల 400/500లు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి కళాశాల పేరుని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం జరిగిందన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ నుండి కె సిరి చందన 879/1000, బైపిసి నుండి జార మరియం 873/1000 మరియు HEC నుండి ఎం రామ్ చరణ్ 928/1000 మార్కులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు మాట్లాడుతూ అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ కళాశాల పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టినందుకు మరియు అత్యున్నత ఫలితాలు అందించినందుకు విద్యార్థినీ విద్యార్థులు అందరికి అభినందనలు తెలిపారు. కళాశాల మొదటి సంవత్సరం 40% మరియు ద్వితీయ సంవత్సరం 42% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకులు మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు అందరిని అభినందించడం జరిగింది. కాగా..

K అభిరామ్ MPC 463/470 మార్కులు సాధించగా అతని తండ్రి గణేష్ ఇల్లందకుంట మల్యాల గ్రామం పోస్ట్ మాస్టర్ గా కొనసాగుతున్నారు. అలాగే J మాధవి BPC 379/440 రాగా ఆమె తండ్రి మనోజ్ హుజురాబాద్ మండలం సిర్సపల్లి వ్యవసాయ ఆధారిత కుటుంబంగా కొనసాగుతోంది. T అఖిల HEC లో 400/500 హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లె గ్రామం కాగా ఆమె తండ్రి భిక్షపతి వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండి వచ్చారు. రెండవ సంవత్సరం నుండి HEC లో M రాంచరణ్ 928/1000 సాధించగా ఆయన తండ్రి రాజు చెల్పూర్ వాస్తవ్యులు, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. MPC నుండి కె సిరి చందన 879/1000 మార్కులు రాగా, తండ్రి అంజనీ కుమార్ స్థానిక హుజురాబాద్ నివాసం, BPC నుండి జార మరియం 873/1000 తండ్రి late అబూ సయ్యద్ అహ్మద్ స్థానిక హుజురాబాద్ నివాసి, ఆమె తల్లి రోజు వారి కూలీ పనులు చేస్తూ ఉంటారు. ఇలా ఈ విధంగా నిరుపేద కుటుంబాల చెందిన విద్యార్థులు చదువులో మెరీకల్ గా రాణించడం హర్షినీయామని పలువురు పేర్కొన్నారు.

రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!