Social 1080×1350 • Multi-page
23-04-2025 BREAKING NEWS 08:09 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ బిజెపి నిరసన, క్యాండిల్ ర్యాలీ.

జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర మూకల దాడిని ఖండిస్తూ బిజెపి నిరసన, క్యాండిల్ ర్యాలీ.
IMG-20250423-WA0092

– ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది..

– మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం..

– బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మూ కాశ్మీర్ పహాల్గాంలో ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మండల ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, మోడపు వినయ్ ల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం హుజురాబాద్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దాడి గడలలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముళ్ల కలిసిమెలిసి బతుకుతున్న భారతదేశంలో మతం పేరుతో ఉగ్ర మూకలు మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు. పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టూ ముట్టి ఆటవికంగా హత్య చేసి గెలిచామనుకోవడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఉగ్ర మూకల దాడిలో ఆగిన ఊపిరి ప్రతి భారతీయుల్లోనూ ఉద్రేకాన్ని రగిలించిందన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను, దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని చెప్పారు. ఉగ్ర మూకల దాడి ఇదొక క్రూరమైన, హేయమైన, అమానవీయమైన చర్య అని పేర్కొన్నారు. మతం పేరుతో దాడులకు తెగ బడిన ఉగ్రమూకల చెడ్డ ఉద్దేశాలు ఎప్పటికీ విజయవంతం కాలేవన్నారు. ఉగ్రమూకల రియాక్షన్ కు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందనీ, ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉగ్రవాదులు ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దేబ్బ తీయలేరని, భారతదేశం ఎవరికి తలవంచదని, ధైర్యంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, మాజీ కౌన్సిలర్ పీ వెంకటరెడ్డి, నాయకులు నల్ల సుమన్, చైతన్య, శక్తి కేంద్ర ఇన్చార్జిలు తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంకతి వాసు, గంట సంపత్, నరాల రాజశేఖర్, కొలిపాక వెంకటేష్, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, భూత్ అధ్యక్షులు మరియు కార్యవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న బీజేపీ నాయకులు..

Oplus_131072
తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నాయకులు..
Oplus_131072
Oplus_131072

కొవ్వొత్తులతో మృతులకు నివాళులర్పిస్తున్న బిజెపి నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!