Social 1080×1350 • Multi-page
24-04-2025 BREAKING NEWS 06:01 PM
swarnodayam.com
Telugu Daily News

ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం.. – తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కవిత

ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం.. – తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కవిత
IMG-20250424-WA0134

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (హనుమకొండ): బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చే క్రమంలో కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ( నాంచారమ్మ ) ఎరుకల బుట్టను ఇచ్చి స్వాగతం పలికారు. కవితక్క ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు.
కెసిఆర్ ప్రభుత్వంలోనే ఎరుకల కులస్తులకు ఆత్మగౌరవం దొరికిందని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మకు గుర్తింపు వచ్చిందని తెలియజేశారు. 800 సంవత్సరాల క్రితం కాకతీయుల రాజులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామాంజపురంలో నిర్మించిన ఎరుకల నాంచారమ్మ దేవాలయ పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కేంద్రంగా ఎరుకల ఆత్మగౌరవ భవనంతో పాటు ఎరుకల ఎంపవర్మెంట్ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో ఎరుకల కులస్తుల కు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అందాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్ లో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు కూడా ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం
ఎరకల జాతిని గుర్తించి ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకల కులస్తులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేతిరి రాజశేఖర్, మానుపాటి రమేష్, ఓని సదానందం, మానుపాటి సురేందర్, బిజిలి ప్రశాంత్, రాజేష్, భూనాద్రి రంజిత్ తదితరులు పాల్గొన్నారు

కవితక్కకు ఎరుకల బుట్టను నెత్తిన పెట్టి స్వాగతం పలుకుతున్న రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!