Social 1080×1350 • Multi-page
25-04-2025 BREAKING NEWS 03:07 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ

చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ
IMG_20250425_150412

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఈరోజు ఉదయం చెల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టిక మరియు రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా ఫార్మసీ స్టోర్ లోని వేసవి కాలానికి సంబంధించి మందుల నిల్వలను, కుక్క కాటు మందులను పరిశీలించారు. లేబరేటరీ మరియు ఎన్సీడీ క్లినిక్ లను సందర్శించి రక్తపోటు మరియు డయాబెటిస్ రోగులకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ప్రతి నెల వారికి మందుల పంపిణీ రికార్డు పరిశీలించారు. అక్కడికి వచ్చిన రోగులను వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చెల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేబర్ రూమ్ ని సందర్శించి కలెక్టర్ సూచనల మేరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి కానుపులన్నీ గవర్నమెంట్ నార్మల్ డెలివరీల కొరకు ప్రోత్సహించి సిజేరియన్ డెలివరీల పర్సంటేజీ తగ్గించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని నార్మల్ డెలివరీలను పెంచాలన్నారు. అదేవిధంగా అవుట్ రీచ్ కేంద్రాలలో ఆరోగ్య మహిళా హెల్త్ క్యాంపులు నిర్వహించి మహిళలందరికీ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ స్క్రీనింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీలో చెల్పూరు వైద్యాధికారి డాక్టర్ మధు, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి..

సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా వైద్యాధికారి..

ఆస్పత్రికి వచ్చిన రోగులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!