Social 1080×1350 • Multi-page
26-04-2025 BREAKING NEWS 06:36 PM
swarnodayam.com
Telugu Daily News

యువజన కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో హుజురాబాద్ RDO, DE మరియు మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు

యువజన కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో హుజురాబాద్ RDO, DE మరియు మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు
IMG-20250426-WA0094

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 27న జరుగుతున్న (BRS) భారత రాష్ట్ర సమితి ఎల్కతుర్తి సమావేశానికి ప్రచార నిమిత్తం స్థానిక హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పట్టణ పరిధిలోని రహదారులపై ఉన్న సిగ్నల్ పాయింట్స్ మరియు యూటర్న్ వద్ద ఏర్పాటుచేసిన కటౌట్ ల వల్ల గ్రామాలకు వెళ్లే రహదారులు మరియు సిగ్నల్ బోర్డ్స్ కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ దీనిపై RDOకి యువజన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అలాగే ట్రాన్స్కో DEకి హుజురాబాద్ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా కరెంటు స్తంభాలకు పార్టీపరమైన ఫ్లెక్సీలను తొలగించాలని ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు స్థానిక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పట్టణ పరిధి నుండి పరకాల క్రాస్ రోడ్ వరకు రహదారులకు ఇరువైపులా గల చెట్లకు BRS పార్టీ జరుగుతున్న రజత్వోత్సవ సభను ప్రచారం చేస్తూ పర్యావరణానికి నష్టం కల్పించే విధంగా మరియు పర్యావరణాన్ని పార్టీ సమావేశానికి వాడుకొని చెట్లకు అన్నిటికీ BRS పార్టీకి సంబంధించిన గులాబీ రంగు వేయడం జరిగిందన్నారు. ఆ రంగులో ఉన్నటువంటి కెమికల్ వల్ల ఆ చెట్లు చనిపోయే ప్రమాదం ఉందనీ మరియు హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు మరియు డివైడర్ల పై ఉన్నటువంటి హోల్డింగ్లు మరియు ఫ్లెక్సీల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ తరపున ఫిర్యాదు చేశారు. ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్, మండల ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, చల్లూరి విష్ణువర్ధన్, మండల కార్యదర్శి పంజాల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

రహదారిపై సిగ్నల్స్ కనిపించకుండా రోడ్డుపై ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన హోర్డింగులు,

కార్మిక శాఖ కార్యాలయ బోర్డుకు కనిపించకుండా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీ బోర్డు..

హుజురాబాద్ RDO, DE మరియు మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!