26-04-2025 NORMAL NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News
26-04-2025 07:22 PM By Mandala Yadagiri

హరితహారం మొక్కలకు గులాబీ కలర్ వేయడంపై యువజన కాంగ్రెస్ఎంపీడీవోకు ఫిర్యాదు.

హరితహారం మొక్కలకు గులాబీ కలర్ వేయడంపై యువజన కాంగ్రెస్ఎంపీడీవోకు ఫిర్యాదు.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రహదారి పక్కన హరితహారంలో ఏర్పాటు చేసిన చెట్లకు హుజురాబాద్ ఎమ్మెల్యే విషపూరితమైన కలర్లను పార్టీ కలరుగా ఉపయోగించుకుని వేయడాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ MPDO కి పిర్యాదు చేశారు. ఈ నెల 27న జరుగుతున్న (BRS) భారత రాష్ట్ర సమితి ఎల్కతుర్తి సమావేశానికి ప్రచార నిమిత్తం స్థానిక హుజూరాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామం నుండి చిన్నపాపయ్యపాలి గ్రామం వరకు మరియు పరకాల క్రాస్ రోడ్ నుండి కందుగుల గ్రామం వరకు రహదారులకు ఇరువైపుల గల హరితహారం చెట్లకు BRS పార్టీ జరుపుతున్న రజతోస్తవసభను ప్రచారం చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా మరియు పర్యావరణాన్ని పార్టీ సమావేశానికి వాడుకొని చెట్లకు అన్నిటికీ BRS పార్టీకి సంబంధించిన గులాబీ రంగు వేయడాన్ని యువజన కాంగ్రెస్ నాయకులు ఖండించారు. అ రంగులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల చెట్లు చనిపోయే ప్రమాదం ఉందనీ, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసువాలని యువజన కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్ MPDO కార్యాలయ సూపరింటెండెంట్ కు పిర్యాదు చేశారు. ఆ తరువాత BRS పార్టీ చెట్లకి వేసినటువంటి గులాబీ రంగుని తొలగించి చెట్లకి సున్నాన్ని వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్, నియోజికవర్గ కార్యదర్శి ఉమ్మడి సందీప్, హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్, ఇల్లంతకుంట మండల ఉపాధ్యక్షులు వాలసాని సుమన్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, అకినపల్లి శ్యామ్ మరియు జమ్మికుంట పట్టణ NSUI అధ్యక్షులు బీసాడి వంశీ కృష్ణ పాల్గొన్నారు.

హుజురాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేస్తున్న యువజన కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!