Social 1080×1350 • Multi-page
26-04-2025 BREAKING NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News

కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి

కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి
IMG_20250426_201145

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల కాశ్మీర్లోని పహల్గాం లో ఉగ్రవాదులు జరిపిన దాడులలో మరణించిన వారికి హుజురాబాద్ కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరాణా వర్తక సంఘం నాయకులు మాట్లాడుతూ దాడులకు పాల్పడి మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులను భారత ప్రభుత్వం ఏరివేయాలన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు కూడా భారత ప్రభుత్వం తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. భారత ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు భారతదేశంలో ఉన్న పాకిస్తానీలను తిరిగి వారి దేశానికి పంపించేలా ఆదేశాలు ఇవ్వడం హర్షినియమన్నారు. ప్రస్తుత తరుణంలో భారతదేశంలోని ప్రజలంతా ఏకతాటిపై ఉండి ఉగ్రవాదుల అణిచివేతకు సహకరించాలని అన్నారు. అనంతరం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు శీలా రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ యాంసాని శశిధర్, ఉపాధ్యక్షులు గంగిశెట్టి మహేష్, ప్రభాకర్, సాగర్, శ్రవణ్, విజయ్, బొల్లి శ్రీను, వేణు, పుల్లూరి శ్రీధర్, గర్రెపెల్లి శ్రీనుగుప్తా, s రవీందర్, కాచం ప్రభాకర్, శ్రీకాంత్ డిస్ట్రిబ్యూటర్ సోదరులు, వర్తక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అమరులకు నివాళులర్పిస్తున్న వర్తక వాణిజ్య సంఘం నాయకులు

చౌరస్తాలో నివాళులర్పిస్తున్న కిరాణా వర్తక సంఘం నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!