Social 1080×1350 • Multi-page
28-04-2025 BREAKING NEWS 09:35 AM
swarnodayam.com
Telugu Daily News

రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.. – కనుకులగిద్దలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు. – జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమానికి విశేష స్పందన

రాజ్యాంగాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.. – కనుకులగిద్దలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు. – జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమానికి విశేష స్పందన
IMG-20250428-WA0026

– పాహెల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించిన నేతలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 27: ఒక్క అడుగుతో మొదలై లక్షల మందితో జై బాపు, జై భీం,జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా వాడ, వాడలా, గ్రామ, గ్రామాన కొనసాగుతుందని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరు మాళ్, మానకొండూరు శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం రోజున హుజురాబాద్ మండల పరిధిలోని కనుకులగిద్ద గ్రామంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ జ్యాంగ పరిరక్షణ పేరుతో భారీ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిజెపి అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాల వల్ల దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని, ప్రజా స్వామ్యాన్ని రక్షిస్తుందని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని, హుజురాబాద్ నియోజకవర్గం ముందు వరసలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రణవ్ కు అభినందనలు తెలియజేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ తామంతా కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. పాహెల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపి, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కూడా చైర్మన్, హుజురాబాద్ రాజ్యాంగ పరిరక్షణ ఇంచార్జి ఇనుగాల వెంకట రామిరెడ్డి, పరిరక్షణ పాదయాత్ర కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ రుద్ర సంతోష్, కరీంనగర్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, ఏస్పి సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, మండల శాఖ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మార్కెట్ చైర్మెన్లు, డైరెక్టర్ల, ఇళ్ళంధకుంట దేవస్థాన చైర్మెన్, డైరెక్టర్లు, హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

Oplus_131072

రాజ్యాంగ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!