28-04-2025 NORMAL NEWS 12:12 PM
swarnodayam.com
Telugu Daily News
28-04-2025 12:12 PM By Mandala Yadagiri

బిఆర్ఎస్ హాయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి….ఆపరేషన్ కగార్ ఆపేయాలి…గులాబి రజతోత్సవ సభ.. గ్రాండ్ సక్సెస్ అశేషంగా తరలివచ్చిన జనవాహిని… పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం..కార్యకర్తల్లో జోష్.

బిఆర్ఎస్ హాయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి….ఆపరేషన్ కగార్ ఆపేయాలి…గులాబి రజతోత్సవ సభ.. గ్రాండ్ సక్సెస్ అశేషంగా తరలివచ్చిన జనవాహిని… పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం..కార్యకర్తల్లో జోష్.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ, (ఎల్కతుర్తి): ప‌దేండ్ల‌లో తెలంగాణ‌ను ద‌గ‌ద‌గ‌లాడే విధంగా, అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామ‌ని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” శ్రీరామ‌చంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావ‌ణ సంహ‌రం చేసి అయోధ్య‌కు తిరిగి రావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ప్పుడు రాముల‌వారి సోద‌రుడు ల‌క్ష్మ‌ణుడు స‌హా చాలా మంది పెద్ద‌లు లంక చాలా సువ‌ర్ణ‌మ‌యంగా ఉంది.. అద్భుతంగా ఉంది.. ఇంక‌ మ‌నం అయోధ్య‌కు ఎందుకు ఇక్క‌డ్నుంచే ప‌రిపాల‌న చేద్దాం అంటారు.. దానికి శ్రీరామ‌చంద్రుడు ఒప్పుకోరు.. క‌న్న‌త‌ల్లిని, జ‌న్మ‌భూమిని మించిన‌టువంటి స్వ‌ర్గం ఏది కూడా ఉండ‌దు. కాబ‌ట్టి మ‌నం అయోధ్య‌కే త‌ర‌లిపోవాల‌ని చెప్పి తిరిగి వ‌చ్చారు అని కేసీఆర్ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో, చాలా గంద‌ర‌గోళ ప‌రిస్థితిలో, దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న‌టువంటి.. ఆత్మ‌హ‌త్య‌ల‌కు అల‌వాల‌మైన, వ‌ల‌స‌ల‌కు నిల‌య‌మైన‌టువంటి.. వ‌ల‌స‌వాదుల విష‌కౌగిలిలో న‌లిగిపోతున్న‌టువంటి తెలంగాణను ఎట్టి ప‌రిస్థితుల్లో విముక్తి చేయాల‌ని స్వ‌రాష్ట్రం సాధించాల‌ని, జ‌న‌నీని, జ‌న్మ‌భూమిని మించింది లేద‌ని చెప్పి నేను ఒక్క‌డిగా బ‌య‌ల్దేరి తెలంగాణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాను. 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవ‌మాన‌ప‌రిచారు. ఎన్నో మాట‌లు అన్నారు. ఎగ‌తాళి, అవ‌హేళ‌న చేశారు. మఖ‌లో పుట్టింది పుబ్బ‌లో పోత‌ద‌ని అన్నారు. కానీ అనేక మంది త్యాగాల‌తోని, వంద‌లాది మంది బ‌లిదానాల‌తోని, అనేక ఉద్య‌మాల‌తోని యావ‌త్ తెలంగాణ అద్భుత‌మైన ఉద్య‌మమై ఎగిసిప‌డింది. ఒక స‌మ‌యంలో తెలంగాణ యావ‌త్ ఒక ప‌క్క‌న నిల్చుని బ‌రిగీసి నా తెలంగాణ అక్క‌డ పెట్టు అని నిల‌బ‌డ్డ‌ సంద‌ర్భం సృష్టించాం. తెలంగాణ‌ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ప్ర‌జ‌లు దీవిస్తే అద్భుత‌మైన ప‌దేండ్ల పాటు ద‌గ‌ద‌గాలాడే తెలంగాణ‌ను త‌యారు చేసి, అంద‌రూ బిత్త‌ర‌పోయే విధంగా, ఆశ్చ‌ర్య‌పోయే విధంగా తెలంగాణ‌ను నిర్మాణం చేసుకున్నాం. 25 ఏండ్ల సుధీర్ఘ చ‌రిత్ర‌ను ఇవాళ ర‌జ‌తోత్స‌వ‌ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో జ‌రుపుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొంద‌రు అడ్డుకుంటున్నారు. ఈ గ‌డ్డ‌కు ప్ర‌త్యేక‌త ఉంది. రాణి రుద్ర‌మ ఏలిన వీర‌డ‌గ్డ‌. స‌మ్మ‌క సార‌క్క‌ల పోర‌గుడ్డ‌, బ‌మ్మెర పోత‌న క‌విత మాధుర్యం పండించిన జీవ‌గ‌డ్డ‌.. ఈ వ‌రంగ‌ల్ నేల‌కు వంద‌నం చేస్తున్నా. మ‌న అమ‌ర‌వీరుల‌కు శిర‌స్సు వంచి నివాళుల‌ర్పిస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.


ఆపరేషన్ కగార్ ఆపేయాలి…1
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కోసం చేపడుతున్న ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలు ఉన్నాయని చంపుకుంటా పోవడం పరిష్కారం కాదని, మావోయిస్టులు కూడా మానవత్వం ఉన్న మనుషులేనని వారితో మంచి వాతావరణంలో చర్చలు జరపాలని కోరారు. కగార్ ఆపరేషన్ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపానున్నట్లు స్పష్టం చేశారు.

గులాబి రజతోత్సవ సభ.. గ్రాండ్ సక్సెస్

అశేషంగా తరలివచ్చిన జనవాహిని.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం.. కార్యకర్తల్లో జోష్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, ఏప్రిల్ 27: హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరైన భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ విజయవంతమైంది. తెలంగాణ అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు బహిరంగ సభకు తరలివచ్చారు. బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. సభకు వచ్చిన వారిలో సుమారు 70% యువతే కావడం విశేషం. సభలో రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పాడిన తెలంగాణ పాటలు యువతను ఉ ర్రూతలూగించాయి. సభా ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. ఎటు చూసినా లక్షలాది జనం కనిపించారు. అతిపెద్ద వేదికపై అందరూ ఆశీర్సులయ్యారు. కెసిఆర్ హెలికాప్టర్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఆయనకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కెసిఆర్ ప్రసంగానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆయన మాట్లాడుతున్నంత సేపు సీఎం సీఎం యువత పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ కాంగ్రెస్ పై బిజెపి పై విమర్శలు చేసిన సందర్భంగా సభికుల నుండి మంచి స్పందన లభించింది. కెసిఆర్ ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పలకకపోవడం గమనార్హం. సభకు హాజరైన ప్రజానీకానికి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ శ్రేణులకు రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత సభా ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ పూర్తయిన తర్వాత విజయసంకేతంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. సభపూర్తయిన తర్వాత ఎలుకతుర్తి నుంచి హనుమకొండ వరకు అలాగే హుజరాబాద్ వరకు హుస్నాబాద్ వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కెసిఆర్ సభముగిసిన తర్వాత కూడా వేలాదిమంది సభా ప్రాంగణానికి వస్తూ కనిపించారు. సుమారు పది లక్షల మందికి పైగా సభకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఊహించిన దానికంటే సభఎక్కువగా సక్సెస్ కావడంతో గులాబి స్టేషన్లో ఆనంద ఉ త్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. కెసిఆర్ వేదిక మీదికి వచ్చిన తర్వాత ప్రజలు భారీకేట్లను దోచుకుని మీడియా గ్యాలరీ విజపి గేలరీ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కెసిఆర్ హెలికాఫ్టర్ దిగిన తర్వాత కూడా బరికేట్లను తోసుకొని ప్రజలు ముందుకు వచ్చారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదువులోకి తీసుకురావలసి వచ్చింది. మీడియా గ్యాలరీలో విఐపీ గ్యాలరీ లోనూ.. కార్యకర్తలే కూర్చోవడంతో పాత్రికేయులు విఐపిలు అసహన వ్యక్తం చేశారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పాడిన పాటలు అందరిని అలరించాయి. అభిమానులు మహిళలు పాటలకు నృత్యాలు చేశారు. కొందరు విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. రైతులు ఎడ్ల బండ్లపై తరలిరావడం ఆకట్టుకుంది. సభ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సభ సక్సెస్ కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ వినయ్యాన్కర్ రవీందర్రావు పెద్ది సుదర్శన్ రెడ్డిలను కెసిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. బహిరంగ సభకు భూములను ఇచ్చిన రైతులను కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!