28-04-2025 NORMAL NEWS 09:21 PM
swarnodayam.com
Telugu Daily News
28-04-2025 09:21 PM By Mandala Yadagiri

సభ సక్సెస్ పట్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు

సభ సక్సెస్ పట్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఎలుకతుర్తిలో జరిగిన సభకు హుజురాబాద్ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లి సక్సెస్ కావడంతో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గం నుండి 50 వేల మందిని సభకు తరలించాలన్న లక్ష్యంతో కష్టపడగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడం మాజీ సీఎం కేసీఆర్ ను చూడడానికి ప్రజల ఆసక్తిగా ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీ నాయకులే విజయం సాధిస్తారని స్పష్టమైందని అన్నారు. నియోజకవర్గంలోని నాయకులు ఇప్పటినుండే రాబోయే పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండాలని ఆయన అన్నారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!