30-04-2025 NORMAL NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News
30-04-2025 06:59 PM By Mandala Yadagiri

పది ఫలితాల్లో మాంటిస్సోరి విద్యార్థుల ప్రభంజనం

పది ఫలితాల్లో మాంటిస్సోరి విద్యార్థుల ప్రభంజనం
IMG_20250430_185501

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో స్థానిక కాకతీయకాలనీలో గల మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ గీతాశాజు తెలిపారు. పాఠశాలకు చెందిన ఖతీజా జర్ఫీన్ కు 588/600 మార్కులను పొంది హుజురాబాద్ పట్టణంలో టాపర్ గా నిలిచారు. అలాగే యం సంజనకు 573/600 మార్కులు పొందగా 550 మార్కులకు పైగా 10 మంది విద్యార్థులు,500 మార్కుల పైన 33 మంది విద్యార్థులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 100% శాతం ఫలితాలు సొంతం చేసుకోవడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ఫలితాలకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. కాగా అత్యధిక ఫలితాలు సాధించడం పట్ల అన్న వ్యక్తం చేస్తూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు.

ఖతీజా జర్ఫీన్ కు 588/600 మార్కులను పొంది హుజురాబాద్ పట్టణంలో టాపర్ గా నిలిచారు.
యం సంజనకు 573/600 మార్కులు పొందిన విద్యార్థినీ
Oplus_131072
Oplus_131072

అంబేద్కర్ చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేసి, పటాకలు కాలుస్తున్న మాంటిసోరి పాఠశాల సిబ్బంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!