Social 1080×1350 • Multi-page
01-05-2025 BREAKING NEWS 01:48 PM
swarnodayam.com
Telugu Daily News

కార్మిక శ్రమ జీవులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన పోలాడి రామారావు.

కార్మిక శ్రమ జీవులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన పోలాడి రామారావు.
IMG-20250501-WA0065

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు పోరాడారని. పోరాటాల ఫలితంగానే కార్మికుల్లో చైతన్యం వెళ్లి విరిసిందని శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, కార్మికులు తమ హక్కులు సాధించుకున్న రోజే ఈనాటి మేడే రోజని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. గురువారం ఇక్కడ సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన మే డే దినోత్సవ కార్య క్రమంలో పోలాడి రామారావు పాల్గొని మాట్లాడారు. కార్మికులు కర్షకులు అధునాతన పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని కోరుతో, కార్మిక వర్గం తరపున నిలబడే వారికి అండగా ఉండటమే తమ ధ్యేయమని తెలుపుతూ దేశంలోని కార్మికులందరికి పోలాడి రామారావు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సమాఖ్య నాయకులతో కలిసి మీడియా ప్రతినిధులతో రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనగణతో పాటు కులగణన చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చుతుందని, ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గ నిర్దేశనం అవుతుందని పోలాడి రామారావు పేర్కొన్నారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ పాలకులకు దన్యవాదాలు తెలుపుతూ దీనికి కాల పరిమితితో చట్టబద్ధతతో కూడిన పార దర్శకంగా పక్కా ప్రణాళిక విధి విధానాలు ప్రకటించాలని పోలాడి విజ్ఞప్తి చేశారు.

పోలాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!