01-05-2025 NORMAL NEWS 07:43 PM
swarnodayam.com
Telugu Daily News
01-05-2025 07:43 PM By Mandala Yadagiri

వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం

వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభం
IMG-20250501-WA0007

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జిల్లా యువజన క్రీడ శాఖ, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సొల్లు సారయ్య మాట్లాడుతూ…శిబిరాల ద్వారా కబడ్డీ క్రీడలో నైపుణ్యం పొందాలని అన్నారు. ఈ శిబిరం మే 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ సహాయ కార్యదర్శి అంజయ్య టిజిపేట ఉపాధ్యక్షులు యేముల రవికుమార్, హాకీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ సాదుల శ్యాంకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్, టిజిపేట గౌరవ సలహాదారు రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి, పిఈటి భాగ్యలక్ష్మి, కోచ్ రాజ్ కుమార్, కార్యదర్శి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!