Social 1080×1350 • Multi-page
02-05-2025 BREAKING NEWS 04:17 PM
swarnodayam.com
Telugu Daily News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం
IMG-20250502-WA0070(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని ఇందిరాక్రాంతి పథకం ద్వారా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం సందర్శించి వరి ధాన్యం కొనుగోళ్ళను పరిశీలించి రైతు సోదరులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఒక బస్తకు తరుగు పేరిట రెండు కిలోలు కట్ చేస్తున్నారని అ సమస్యను పరిష్కరించాల్సిందిగా రైతు సోదరులు చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన వారు ఏపీఎంతో ఫోన్ లో మాట్లాడి బస్తాకు కిల చొప్పున తప్ప ఎక్కువ కట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. అనంతరం హమాలీ సోదరులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న తమకు మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం లేదని తెలుపగా తక్షణమే హమాలి సోదరులకు మంచినీటి వసతితో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల సాంబశివరెడ్డి, యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్నవేన రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, మ్యాకమల్ల అశోక్, మడిపల్లి గ్రామశాఖ ఉపాధ్యక్షుడు మంగ అశోక్, యువజన కాంగ్రెస్ నాయకులు రామిడి సూర్యతేజారెడ్డి, రైతు సోదరులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ళను పరిశీలిస్తున్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!