Social 1080×1350 • Multi-page
04-05-2025 BREAKING NEWS 10:15 AM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ విద్యానగర్‌లో కోతుల దాడి…మహిళకు తీవ్ర గాయాలు

హుజూరాబాద్ విద్యానగర్‌లో కోతుల దాడి…మహిళకు తీవ్ర గాయాలు
IMG-20250504-WA0003

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో కోతుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా, అడ్వకేట్ గోస్కుల శ్రీనివాస్ గల్లీలో కోతుల దాడికి గురైన పుల్లూరి త్రివేణి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. దాడి సమయంలో కోతులు ఆమెను కరవడంతో ఆమె కాలి భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది.కోతులు నివాస ప్రాంతాల్లోకి చొరబడి చిన్నపిల్లలు, వృద్ధులపై దాడులు చేయడం, ఇంటి వస్తువులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఫలితంగా, ప్రజలు ఉదయం, సాయంత్రం సమయంలో ఇంటి బయటకు రావడాన్ని కూడా భయంతో మానేస్తున్నారు.

హుజురాబాద్ ప్రాంత ప్రజల డిమాండ్లు:

మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ ప్రతినిధులు తక్షణమే స్పందించి కోతుల బెడదకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. కోతుల దాడులను అడ్డుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని, పట్టణంలో భద్రతాభద్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని హుజురాబాద్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

కోతులు దాడులు తీవ్రంగా గాయపడిన మహిళ..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!