Social 1080×1350 • Multi-page
04-05-2025 BREAKING NEWS 03:29 PM
swarnodayam.com
Telugu Daily News

జూనియర్ సివిల్ జడ్జి కి ఘన సన్మానం

జూనియర్ సివిల్ జడ్జి కి ఘన సన్మానం
IMG_20250504_152643

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:ఇటీవల జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికైన బత్తుల మానసను హుజురాబాద్ పద్మశాలి ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (పోపా) అసోసియేషన్ కార్యవర్గం ఆదివారం ఘనంగా సన్మానించింది. శాలువా కప్పి బొకేను అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంజి జయవర్ధన్, మండల వీరస్వామిలు మాట్లాడుతూ చిన్న వయసులోనే జడ్జిగా ఎంపిక అవడం గర్వకారణంగా ఉందన్నారు. యువతీ యువకులు మానసను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మానసను మేనత్త బత్తుల ఉమాదేవి- మనోజ్ దంపతులు దత్తతతీసుకుని ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించారని కొనియాడారు. ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమించే నిరుద్యోగులకు మానస స్ఫూర్తిగా నిలిచిందన్నారు. పద్మశాలి బిడ్డగా జాతి
గర్వపడుతుందని, ఉత్తమ సేవలందించి అధికారుల ప్రజల,ప్రశంసలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోపా ఉపాధ్యక్షుడు చందుపట్ల రామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పరాజు రమేష్, పోపా సభ్యులు కడవేరుగు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
మానస సన్మానిస్తున్న పోపా నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!