Social 1080×1350 • Multi-page
05-05-2025 BREAKING NEWS 02:10 PM
swarnodayam.com
Telugu Daily News

ఫార్మర్ ఐడిలు నమోదు ప్రారంభం.

ఫార్మర్ ఐడిలు నమోదు ప్రారంభం.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వ్యవసాయరంగాన్ని ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వము రైతులకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యునిక్ ఐడి) ఆధార్ కార్డ్ తరహాలో రైతులకు అందిస్తున్నందున పోతిరెడ్డిపేట గ్రామపంచాయతీలో వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్ రైతులకు నమోదు పక్రియ ప్రారంభించారు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు కుడా కేంద్ర ప్రభుత్వముచే లబ్ది పొందుతున్న పియం కిసాన్ సమ్మాన్ నిది, వివిధ పథకాలు మరియు రాయితీలు రాబోవు కాలములో పొందాలంటే ఈ 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని అందుకు పోతిరెడ్డిపేట రైతులు గ్రామ పంచాయతీ వద్ద ప్రతి సోమ, గురువారాల్లో వెంకట్రావుపల్లి రైతులు గ్రామ పంచాయతీ వద్ద ప్రతి బుధ, శనివారాల్లో సిర్సపల్లి రైతులు రైతు వేదిక వద్ద ప్రతి మంగళ, గురువారాల్లో నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఇక్కడి రైతులు కొద్దీ రోజుల తరువాత వారి సమీప మీ-సేవలో సంప్రదించి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణ మాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ సంబంధం లేదని, ఇది కేంద్ర ప్రభుత్వ పథకల లబ్ధి రాయితీలకు మాత్రమే అని తెలిపారు. రైతు విశిష్ట సంఖ్య(ఫార్మర్ ఐ.డి)ను పొందుటకు రైతు యొక్క ఆధార్, భూమి పాస్ పుస్తకము మరియు అధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ని తీసుకొని రావాలన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!