Social 1080×1350 • Multi-page
06-05-2025 BREAKING NEWS 05:03 PM
swarnodayam.com
Telugu Daily News

భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను బహిష్కరించాలని తాసిల్దార్ కు వినతి.

భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను బహిష్కరించాలని తాసిల్దార్ కు వినతి.
IMG_20250506_170115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజురాబాద్ డిప్యూటీ ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేసారు.
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన దాడిని నిరసిస్తూ పాకిస్తాన్ పౌరులు వెంటనే పాకిస్థాన్ వెళ్ళిపోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధం కొరకు ఏ నిర్ణయం తీసుకుంటారో అని భయానికి పాకిస్తాన్ వనికి పోతుందన్నారు. నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు పాకిస్థాన్ ఇప్పటికే అడుక్కునే పరిస్థితిలో ఉందన్నారు. అయినా పాకిస్తాన్ వక్రబుద్ధి మారలేదు అన్నారు. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ మీద ప్రేమను చూపిస్తున్న పాకిస్తాన్ ప్రేమికులు ఎవరున్నా గాని ఈ దేశం నుండి వెళ్లిపోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, తాజా మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు నల్లాని నరేందర్, యాంసాని శశిధర్, సబ్బని రమేష్, అంకతి వాసు, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, గంట సంపత్, డోరి అయిలయ్య, కొలిపాక వెంకటేష్, మోతే తిరుపతి, గరిగే శివకృష్ణ, ఆవుల సదయ్య, తాళ్లపల్లి దేవేంద్ర, భాస్కర్ యాదవ్, ముషం వెంకటేశ్వర్లు, యాళ్ళ రాజిరెడ్డి, కొండల్ రెడ్డి, పడారి కొమురయ్య, పల్లె వీరయ్య, వేముల హృతిక్, యాట రాజేష్ కన్న, బెజ్జంకి రవీందర్, తాళ్లపెళ్లి హరీష్, గంధం అనిల్, తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ తాసిల్దార్ వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!