Social 1080×1350 • Multi-page
09-05-2025 BREAKING NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News

ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓపిక పరీక్షించవద్దు..57 డిమాండ్లతో కూడిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : ఆర్కే వెంకట్ డిమాండ్

ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓపిక పరీక్షించవద్దు..57 డిమాండ్లతో కూడిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : ఆర్కే వెంకట్ డిమాండ్
IMG-20250509-WA0054

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓపిక పరీక్షించవద్దు అని, 57 డిమాండ్లతో కూడిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలనీ ఆర్కే వెంకట్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇటీవల ముఖ్యమంత్రి సెక్రటేరియట్లో నిర్వహించిన త్రిసభ్య కమిటీకి జేఏసీలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే వెంకట్ హాజరైన సందర్భంలో పత్రిక విలేకరులు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ,ఉపాధ్యాయుల సమస్యలపై గతంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులతో కమిటీ వేసి కాలయాపనకే పరిమితమయ్యారు. ఏఒక్క ఉద్యోగ ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.అది కేవలం తూతూ మంత్రంగానే మిగిలిపోయాయన్నారు. ఇటీవల జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ కూడా ఏ సమస్యల పరిష్కారము కావేవో మని ప్రతి ఉద్యోగి ,రిటైర్మెంట్ కాబోయే ఉద్యోగులు తీవ్ర మనస్థాపానికి గురై ఆందోళన చెంది మరణిస్తున్నారని , ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ వహించి ఉద్యోగుల , ఉపాధ్యాయుల ,పెన్షనర్ల గోస పట్టించుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క శవాల గుట్టలే చూడాల్సి వస్తుందని అందుకు ప్రభుత్వమే జవాబుదారి తనంగా కోర్టు లోదోషిగానిలబడవలసి వస్తుందని, తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కూలివారికి జీతం ఇస్తే కూలికి వస్తారు ,ఉద్యోగులకు జీతం ఇస్తే ఉద్యోగం చేస్తారు కానీ ఇలాంటి పరిస్థితులు తిరిగి పునరావతమైతే ఎవ్వరు కూడా పనిచేయాలని కూడా రారని ఆ పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు.దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు,మంత్రులు శాసనసభ సభ్యులు ,శాసనమండలి సభ్యులు ,ఎంపీలు జీతాలు మరియు పెన్షన్లు ప్రతినెలా ఒకటో తారీకు నాడు తీసుకోవడం లేదా !ఇది గొప్ప విషయమా ! అని హాస్యాస్పదము వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లే అడుగుతున్నారు తప్ప గొంతమ్మ కోరికలు కాదని వెంటనే స్పందించి ఇప్పటికైనా ఉద్యోగుల ,ఉపాధ్యాయుల 57 డిమాండ్లతో కూడిన అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆర్కే వెంకట్ డిమాండ్ చేశారు.

త్రిసభ్య కమిటీకి జేఏసీలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హాజరైన పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్కే వెంకట్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!