10-05-2025 NORMAL NEWS 10:34 AM
swarnodayam.com
Telugu Daily News
10-05-2025 10:34 AM By Mandala Yadagiri

హుజురాబాద్ టౌన్ సిఐని సన్మానించిన హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్

హుజురాబాద్ టౌన్ సిఐని సన్మానించిన హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్
IMG_20250510_103150

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా నూతనముగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ టీ కరుణాకర్ ను హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు, జామే మస్జిద్ ఈద్గా కబ్రుస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ డివిజన్ జమాత్ ఉలేమా అధ్యక్షులు మిర్జా ఇమ్రాన్ బేగ్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ షాకీర్ కలిసి హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ ను శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ లో అందరం కలిసి ఉంటామని, ఒకరికి ఒకరు సహాయ సహకారాలు చేసుకుంటు, గంగా జమున తహసిప్ కొనసాగుతది అన్నారు. లా అండ్ ఆర్డర్ ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా పూర్తిగా సహకరిస్తారని, పోలీసులాంటేనే హుజురాబాద్ పట్టణ జనం ఎప్పటికీ చాలా గౌరవం ఇస్తారని అన్నారు. హుజురాబాద్ పట్టణంలో చాలా ప్రశాంత వాతావరణ ఉంటుందని మహమ్మద్ ముజాహిద్ ఈ సందర్భంగా తెలిపారు. హుజురాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరుణాకర్ ఇక్కడి నుండి మళ్ళీ బదిలీ అయ్యేటప్పటికీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ప్రమోషన్ తీసుకొని వెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072

నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన టీ కరుణాకర్ కి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరిస్తున్న ముజాహిద్ హుస్సేన్, ముస్లిం మైనార్టీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!