Social 1080×1350 • Multi-page
10-05-2025 BREAKING NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News

సైనికులకు సంఘీభావంగా హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ర్యాలీ.

సైనికులకు సంఘీభావంగా హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ర్యాలీ.
IMG_20250510_200252

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే10:
భారత సైనికులకు సంఘీభావంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు శనివారం ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్థానిక హైస్కూల్ క్రీడా మైదానం నుండి పలు వీధుల గుండా జాతీయ జెండాలను చేత భూని ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దాయదీ దేశానికి వనుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో భారతీయులు అందరు ఒక్కటై భారత ఆర్మీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాకీ క్లబ్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ బోడిగే తిరుపతి, బండ శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, గుడ్డేలుగుల సమ్మయ్య, యేముల రవికుమార్, భూసారపు శంకర్, ఎండి యూసుఫ్, ఎండి సంజు, నిమ్మటూరి సాయికృష్ణ, మాటూరి రాజేష్, కాయకంటి రాజేష్, సబ్బని విక్రం, కోచ్ మోటపోతుల విక్రం, వినయ్, విపుల్, రాజ్ కుమార్, వంశీ, రాజ్ కుమార్ తోపాటు క్రీడాకారులు పాల్గొన్నారు.

Oplus_131072
సైనికులకు సంఘీభావంగా ర్యాలీ తీస్తున్న క్రీడాకారులు
Oplus_131072
Oplus_131072
అంబేద్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడిన క్రీడాకారులు, నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!