Telugu Daily News
జూనియర్ సివిల్ జడ్జి సెలెక్ట్ అయిన మానసకు ఆలయ ఫౌండేషన్ ఘన సన్మానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆలయఫౌండేషన్ ఆద్వర్యంలో ఈరోజు హుజురాబాద్ పట్టణానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన బత్తుల మానస జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయిన సందర్భంగా వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. పేద కుటుంబానికి చెందిన మానస ఎంతో కష్టపడి కృషి, పట్టుదలతో జూనియర్ సివిల్ జడ్జి సాధించడం పద్మశాలి యువతీ యువకులకు ఆదర్శమని ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదే గుణసాగర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత, బైరి సత్యం, బాలు, బత్తుల మనోజ్, చిలుకమారి సత్యరాజ్ పాల్గొన్నారు. కాగా బత్తుల మానస కు ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ భోపాల్ నుంచి ఫోన్ చేసి మానసకు శుభాకాంక్షలు తెలిపారు.



