Social 1080×1350 • Multi-page
12-05-2025 BREAKING NEWS 05:37 PM
swarnodayam.com
Telugu Daily News

వీర జవాన్లకు సంఘీభావంగా హనుమాన్ దీక్షపరులు ర్యాలీ

వీర జవాన్లకు సంఘీభావంగా హనుమాన్ దీక్షపరులు ర్యాలీ
IMG_20250512_173333

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆపరేషన్ సింధూరం-2 దేశ రక్షణకోసం ప్రాణాలను పణంగా పెట్టీ గస్తీ చేస్తున్న దేశ రక్షణ కవచాలు అయిన వీర జవాన్లకు సంఘీభావంగా హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులందరూ హుజురాబాద్ లోని హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి రెండు నిమిషాలు మౌనం పాటించి, వీర మరణం పొందిన జవాన్లకి పాలాభిషేకం చేసారు. బార్డర్ లో 140 కోట్ల ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మన కోసం గస్తీ కాస్తున్న వీర జవాన్లకు, పాకిస్థాన్ ఉగ్రముకలు జరిపినటువంటి కాల్పుల్లో అమరులైనటువంటి మురళి నాయక్ మరి ఇతర జవాన్లకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో భారతదేశం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షపరులు జంపాల రామకృష్ణస్వామి, బండి రాజశేఖర్, రమేష్ ఫోటో స్టూడియో, మనీషా స్టూడియో ప్రసాద్, వెంకటేష్, టీవీఎస్ సంజీవరెడ్డి, రాజు, అజయ్, సచిన్, రవి తదితర భక్తులు పాల్గొన్నారు.

అమర వీర జవాన్లకు పాలాభిషేకం చేస్తున్న హనుమాన్ భక్తులు

ర్యాలీగా వచ్చి చౌరస్తాలో అమర జవాన్లకు మద్దతుగా నినాదాలు చేస్తున్న హనుమాన్ భక్తులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!