Social 1080×1350 • Multi-page
13-05-2025 BREAKING NEWS 03:27 PM
swarnodayam.com
Telugu Daily News

టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలి.. (TUWJ -H 143 IJU) యూనియన్ బలోపేతంకు కృషి చేయాలి. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ

టీజెఫ్ రజతోత్సవ వేడుకలకి భారీగా తరలి వెళ్ళాలి.. (TUWJ -H 143 IJU) యూనియన్ బలోపేతంకు కృషి చేయాలి. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ
Oplus_131072

– తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ – H 143 IJU)హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, మే13: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ -H 143 IJU) హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులు మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ ..రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ నాయకత్వంలో మే 31,2025న హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. యూనియన్ బలోపేతం కోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసే ఏకైక సంస్థ TUWJ H-143 అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజెఫ్ రజతోత్సవ వేడుకలకు కరీంనగర్ జిల్లా నుండి భారీ సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో యూనియన్ నూతన అడ్‌హాక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్ గా గూడూరి కొండాల్ రెడ్డి, కో కన్వీనర్ లుగా కే శ్యామ్, కే శ్రీనివాస్ లని నియమించారు.
ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే 15 రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఆలానే మే 31,2025న హైదరాబాద్‌లో జరిగే టీజెఫ్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ లోని పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి బోనాల తిరుమల్, కోశాధికారి జేరీపోతుల సంపత్, సీనియర్ జర్నలిస్టులు మండల యాదగిరి, గూడూరి కొండల్ రెడ్డి, కొండపర్తి శ్రీనివాస్, కోయల్ కారు శ్యామ్, కనకం శ్రీనివాస్, వి రాజు, కేసరి మధుకర్, సబ్బని వెంకటేష్, ఇప్పలపల్లి నరేష్, సుంకరి రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

యూనియన్ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ..

రెన్యువల్ సభ్యత్వం తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొండల్ రెడ్డి..

సభ్యత్వం తీసుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి..

Oplus_131072

నూతనంగా నియామకమైన ఆడహక్ కమిటీ కన్వీనర్ గూడూరీ కొండల్ రెడ్డి, కో కన్వీనర్లు కనకం శ్రీనివాస్, కోయల్ కార్ శ్యామ్ లతో జిల్లా నాయకులు

టియు డబ్ల్యూజే 143 యూనియన్ సభ్యత్వం తీసుకున్న హుజురాబాద్ సీనియర్ జర్నలిస్టులతో జిల్లా నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!