Social 1080×1350 • Multi-page
14-05-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

విక్రమ్ రావు మృతి జర్నలిస్టు ఉద్యమానికి తీరనిలోటు.. -టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు

విక్రమ్ రావు మృతి జర్నలిస్టు ఉద్యమానికి తీరనిలోటు.. -టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు
IMG_20250514_193402

– ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ నేత విక్రమ్ రావుకు అక్షర నివాళి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ అధ్యక్షులు కె.విక్రమ్ రావు మృతి జర్నలిస్టు ఉద్యమానికి తీరనిలోటని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఫెడరేషన్ కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు మాట్లాడుతూ.. తెలుగు వారైన విక్రమ్ రావు జర్నలిజంలో దాదాపు నలభై ఏళ్లుగా అనేక హోదాల్లో పని చేసి జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు. ఆయన ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టుల గొంతుకను బలంగా వినిపించారన్నారు. సామాజిక అంశాలకు సంబంధించిన అనేక సమస్యలను ఆయన బహిర్గతం చేశారన్నారు. ఇంగ్లీష్, హిందీ అన్ని భాషలపై అపారమైన పట్టు కలిగిన కె. విక్రమ్ రావు దేశంలోని ప్రధాన మీడియా సంస్థల్లో పనిచేశారన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ నాయకుడుగా, అధ్యక్షుడుగా నలభై ఏళ్లు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఉద్యమాన్ని విస్తరించి జర్నలిస్టులను జాగృతం చేశారన్నారు. జర్నలిస్టు సమస్యలపై దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న విక్రమరావు మరణం జర్నలిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. ఆయనకు పలవురు జర్నలిస్టు నేతలు అక్షర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ సత్తయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందుల ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావు, జర్నలిస్ట్ నాయకులు శంకర్ రెడ్డి, గుండి కిరణ్, సురేష్, సుదర్శన్ రెడ్డి, రాజశేఖర్, సాయిల్ల దీక్షిత్, అక్కి అనిల్ కుమార్, నరేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ అధ్యక్షులు కె.విక్రమ్ రావు మృతి పట్ల నివాళులర్పిస్తున్న జర్నలిస్టు నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!