Social 1080×1350 • Multi-page
14-05-2025 BREAKING NEWS 10:05 PM
swarnodayam.com
Telugu Daily News

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ
IMG_20250514_214453

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట),మే14 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం రోజున ఉదయం ఓ వృద్ధురాలిని నమ్మించి మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన జమ్మికుంటలో చోటుచేసుకుందది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లికి చెందిన ఇంజమూరి వెంకట సత్యనారాయణ తల్లి ఇంజమూరి వెంకటలక్ష్మి (85) తెల్లవారుజామున ఇంటి బయటకు రాగా ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి “తాత ఉన్నారా?” అని పలకరించినట్లు ఆటు ఇటు చూసి ఎవరు లేరని గమనించి వెంటనే వృద్ధురాలి మెడలో ఉన్న తులం బరువు గల బంగారు గొలుసును చటక్కున లాక్కొని పరారయ్యాడు. దాని విలువ పోలీసుల అంచనా ప్రకారం రూ.35,000లు(మార్కెట్ విలువ సుమారు లక్ష) ఉంటుందని తెలిపారు. బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుప్రక్కల సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు.

Oplus_131072
మాటు వేసి వృద్ధురాలి మెడలోని గొలుసును లాకొనీ వేళ్తున్న ఊహాచిత్రం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!