15-05-2025 NORMAL NEWS 05:36 PM
swarnodayam.com
Telugu Daily News
15-05-2025 05:36 PM By Mandala Yadagiri

గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి.. -తెలంగాణ గ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి & అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్.పి.వి మదన్ మోహన్.

గ్యాస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి.. -తెలంగాణ గ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి & అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్.పి.వి మదన్ మోహన్.
IMG-20250515-WA0096

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 15: హుజురాబాద్‌లోని అంబుజా గ్యాస్ ఏజెన్సీలో 36వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో పి.వి మదన్ మోహన్ మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన సేవలందించినపుడే సంస్థతో వారి అనుబంధం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1989 మే 15న అతి కొద్ది మంది కస్టమర్లతో ప్రారంభమైన సంస్థ, ప్రజల మద్దతుతో మూడు దశాబ్దాల్లో దాదాపు 26,000 మందికి పైగా ఇండేన్ వినియోగదారులకు సేవలందించే స్థాయికి ఎదిగిందన్నారు. విభిన్న మనస్తత్వం గల వినియోగదారులను తృప్తిపరిచేలా ఎల్లప్పుడూ విద్యుత్ వేగంతో స్పందించడమే విజయానికి మూలం అన్నారు.

భద్రతా చర్యలు పై అవగాహన:

గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సిలిండర్ డెలివరీకి ముందు పీడీసీ తనిఖీలు నిర్వహించడం, రబ్బరు ట్యూబ్ లలో లోపాల పర్యవేక్షణ వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు బేసిక్ సేఫ్టీ చెక్‌ కార్యక్రమాలు నిర్వహించి, గ్యాస్ వినియోగం, లీకేజీల సమయంలో స్పందనకు అవసరమైన సమాచారాన్ని వినియోగదారులకు అందించినట్టు తెలిపారు. 1906 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం లాంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు.

ఈకేవైసి మరియు భద్రతాపరమైన సూచనలు:

వినియోగదారులు గ్యాస్ సబ్సిడీ కోసం తప్పనిసరిగా ఈ కే వైసీ పూర్తి చేయాలని, నాణ్యమైన రబ్బరు ట్యూబులు వాడకపోతే ప్రమాద భీమా వర్తించదని హెచ్చరించారు. ఆయిల్ కంపెనీలు ఐదు సంవత్సరాల కాలం పాటు ఉపయోగించగలిగే రబ్బరు ట్యూబులను అందుబాటులోకి తెచ్చాయని, అవే వాడాలని సూచించారు. కాలం చెల్లిన ట్యూబులను వాడే వినియోగదారుల వివరాలను బిల్లుపై చూపిస్తున్నామని తెలిపారు. సిలిండర్ డెలివరీకి వినియోగదారులు ఓటిపి చెబితే మాత్రమే అందించే విధానం అమలులో ఉందన్నారు. రీఫిల్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ 8454955555 ఉపయోగించాలని సూచించారు.

సురక్షిత వంటగదికి సూచనలు:

వంట పనులు పూర్తైన వెంటనే స్టౌ రెగ్యులేటర్ నాబ్ ఆఫ్ చేయాలని, గ్యాస్ ప్లాట్‌ఫాం ఉండాలని, గాలి వెలుపలికి వెళ్లేందుకు వంటగదిలో సరైన వెంటిలేషన్ ఉండాలని, మండే వస్తువులు వంటగదిలో ఉంచకూడదని స్పష్టం చేశారు. ప్రజలపై ఆర్థిక భారం పడకూడదన్న దృష్టితో రూ.920కి సిలిండర్ అందిస్తున్నామని, మార్కెట్‌లో ఇది రూ.1400కి పైగానే ఉంటుందని చెప్పారు. అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.అవసరమైన భద్రతా సూచనలతోపాటు, కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. సిబ్బందిని కండువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ దేవేందర్ రెడ్డి, సీనియర్ కస్టమర్లు గోపాల్ రెడ్డి, కరాటే రమేశ్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
స్టాఫ్ సభ్యులుగా పవన్, శరత్, భరత్, భరత్ రెడ్డి, సరిత, కనుకయ్య, భాస్కర్, సురేశ్, ప్రభు, దామోదర్, ప్రశాంత్, కుమార్, సాగర్, నర్సయ్య, రాంబాబు, సీను, రాజు, హరిష్, కమలాకర్, అనిల్, ప్రేమ్ చిన్న, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

శాలువాతో పివి మదన్మోహన్ ను సత్కరిస్తున్న గ్యాస్ వినియోగదారులు..

గ్యాస్ వినియోగదాలకు అవగాహన కల్పిస్తున్న పీవీ మదన్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!