Social 1080×1350 • Multi-page
15-05-2025 BREAKING NEWS 06:35 PM
swarnodayam.com
Telugu Daily News

సమాచారం అడిగితే కక్ష సాధింపు చర్యలా…?

సమాచారం అడిగితే కక్ష సాధింపు చర్యలా…?
IMG_20250515_183329

కుమార్ యాదవ్ స్వర్ణోదయం రిపోర్టర్, (వీణవంక) మే 15: సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రిటైర్డ్ ఉద్యోగి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు‌. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 23 మంది వివిధ రకాల వాణిజ్య, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్న విషయంపై సమాచార హక్కు చట్టం కింద అదే ప్రాంతానికి చెందిన (ఇప్పలపల్లి గ్రామానికి చెందిన) ముదిగంటి రఘునాథ్ రెడ్డి(86) సంవత్సరాల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సమాచారం కోరినట్లు చెప్పారు. ఉన్నతాధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో సమస్యను హైదారాబాద్ ప్రజా దర్బార్ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ఏట్టకేలకు స్పందించిన అధికారులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో పవన్ సమక్షంలో ఈ నెల 3న విచారణ చేపట్టగా.. ఆ సమయంలో తనపై దుకాణ సముదాయ ఏర్పాటు చేసుకున్న పలువురు దుర్భాషలాడినట్లు ఆరోపించారు. తక్షణమే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై వీణవంక పోలీస్ స్టేషన్ లో ఈ నెల 10న, కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ కి ఈ నెల 13న సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు మోతుకు కోమాల్ రెడ్డి, గడ్డం నారాయణ, కళ్యాణ్ లు బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారి నుండి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నట్లు బాధితుడు చెప్పారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!