Social 1080×1350 • Multi-page
15-05-2025 BREAKING NEWS 09:43 PM
swarnodayam.com
Telugu Daily News

అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ చోరీ

అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ చోరీ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీకి చెందిన వేముల రమేష్ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… బుధవారం అర్ధరాత్రి ఒంటి గంటకు కాకతీయ కాలనీలోని రమేష్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి గేటు దూకి వచ్చాడు. అటు ఇటు వెతికి ఇంటి ఆవరణలో ఉంచిన గ్యాస్ సిలిండర్ ను ఎత్తుకొని గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యాడు. ఇంటి యజమాని రమేష్ ఉదయం ఇంటి ముందట వస్తువులు చిందర వందరగా పడి ఉండడాన్ని చూసి తన ఇంట్లో ఉన్న సిసి పుట్టేజి చూడగా ఒక వ్యక్తి గోడదూకి సిలిండర్ను ఎత్తుకెళ్లిన విషయం బయటపడింది. గతంలో కూడా సిలిండర్ ఎత్తుకెళ్లిన సంఘటన వారింట్లో జరిగింది. కేవలం సిలిండర్ మాత్రమే ఎత్తుకెళ్లడం తెలిసిన వారి పని అయి ఉంటుందని బాధితుని అనుమానం. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!