Social 1080×1350 • Multi-page
16-05-2025 BREAKING NEWS 07:38 PM
swarnodayam.com
Telugu Daily News

డెంగ్యూ వ్యాధి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ చందు

డెంగ్యూ వ్యాధి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ చందు
IMG-20250516-WA0156

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా అవగాహనతో ఉండాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలో వైద్యారోగ్య శాఖ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగ్యూ దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కాళీ టైర్లను కొబ్బరి బొండాలను ఉంచరాదని వాటిలో నిలువ ఉండడం వల్ల దోమలు చేరి గుడ్లు పెడతాయని అన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే దోమల వ్యాప్తి పెరగదని అన్నారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ కేoసారపు సమ్మయ్య, ఆర్ఎంఓ డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్ మధు, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఇన్చార్జి టిపిఓ అశ్వినిగాంధీ, డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, సత్యం, రాజు, వినయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న, వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది,

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!