Social 1080×1350 • Multi-page
16-05-2025 BREAKING NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News

సిర్సపల్లిలో ఉపాధ్యాయుల స్వచ్చంద బడిబాట.. బడికి పంపియాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి.

సిర్సపల్లిలో ఉపాధ్యాయుల స్వచ్చంద బడిబాట.. బడికి పంపియాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి.
IMG-20250516-WA0169

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో శుక్రవారం స్వచ్ఛంద బడిబాట కార్యక్రమం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయ బృందం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని
గ్రామ కూడలి వద్ద, గ్రామంలో ఇంటింటికి , ఉపాధి హామీ పనులు జరుగుచున్న చోటుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విడపు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం వెళ్లి అక్కడే తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు, కంప్యూటర్స్, లైబ్రరీ, స్పోర్ట్స్, సైన్స్ ల్యాబ్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు వస్తున్నాయని విద్యార్థులను అన్ని రకాల తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ రాజిరెడ్డి, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ వనజ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజని, ఉపాధ్యాయులు మల్లేశం, శ్రీనివాస్, జయపాల్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్. వెంకటేశ్వర్లు, లక్ష్మన్, తల్లి తండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్..

Oplus_131072
Oplus_131072
Oplus_131072

డోర్ టు డోర్ తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరుతున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!