Social 1080×1350 • Multi-page
17-05-2025 BREAKING NEWS 07:41 PM
swarnodayam.com
Telugu Daily News

సివిల్ జడ్జి మానసను సన్మానించిన ఎన్ఆర్ఐ

సివిల్ జడ్జి మానసను సన్మానించిన ఎన్ఆర్ఐ
IMG-20250517-WA0130

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసను లండన్ కి చెందిన ఎన్ఆర్ఐ గంప వేణుగోపాల్.. పట్టణంలోని విద్యానగర్ లో ఆమె నివాసంలో శనివారం సన్మానించారు. శాలువాతో సత్కరించి బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రానిoచినపుడే దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు అనేక హక్కులు పొందు పరిచారని తెలిపారు. రాజ్యాంగంలోని హక్కులు అవకాశాలు మహిళలు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని ఆయన సూచించారు. మానసను అభినందిస్తూ మున్ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ తో పాటు పీవీ సేవా సమితి అధ్యక్షుడు తూము వెంకట్ రెడ్డి, బత్తుల మనోజ్, మురికి గౌరీశంకర్, అనిత పాల్గొన్నారు.

మానస సన్మానిస్తున్న ఎన్నారై గంప వేణుగోపాల్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!