Social 1080×1350 • Multi-page
17-05-2025 BREAKING NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి.. – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలరెడ్డి.

హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలి.. – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలరెడ్డి.
IMG-20250517-WA0137

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలరెడ్డి పిలుపు నిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శిశు మందిర్ లో శనివారం బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర, తిరంగా యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలరెడ్డి మాట్లాడుతూ…ఈనెల 22వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్లో నిర్వహించే యాత్రలను హిందువులంతా ఏకమై విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్రంలో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని హిందువులంతా సంగటితమై హిందువుల శక్తి చాటాలని పిలుపునిచ్చారు. ఈనెల 20వ తేదీన హుజురాబాద్ లో తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులు విద్యార్థులు రైతులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు తరలివచ్చి దేశభక్తిని చాటుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రావుల వేణు, తూముల శ్రీనివాస్, గంగిశెట్టి రాజు, అంకటి వాసు, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, రమేష్, విజయ్, చంద్రిక, వెంకటేష్, సదయ్య, దేవేంద్ర, రేణుక, వినయ్, రజిత, కొండల్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలరెడ్డి.

హాజరైన బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!