Social 1080×1350 • Multi-page
18-05-2025 BREAKING NEWS 12:39 PM
swarnodayam.com
Telugu Daily News

క్రీడాకారులకు హాకీ కిట్ల పంపిణీ.. హాకీకి పుట్టినీల్లు హుజురాబాద్..

క్రీడాకారులకు హాకీ కిట్ల పంపిణీ.. హాకీకి పుట్టినీల్లు హుజురాబాద్..
IMG-20250518-WA0078

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే18:
చౌడమళ్ళ కృష్ణకుమారి స్మారకార్ధం భర్త సారయ్య రూ.10,000 విలువైన క్రీడా సామాగ్రిని( హాకీ కిట్ల) పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం క్రీడాకారులకు పదివేల రూపాయలతో హాకీ స్టిక్కలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్లో హాకీ క్రీడకు పెట్టింది పేరని అన్నారు. నిత్యం హై స్కూల్ క్రీడా మైదానంలో సుమారు 70 మంది పిల్లలు శిక్షణ పొందడం గర్వకారణం అని సారయ్య కొనియాడారు. అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీ బోడిగే తిరుపతి గౌడ్ మాట్లాడుతూ.. నిత్యం హాకీ క్రీడాకారులకి అరటి పండ్లు, కోడిగుడ్లు అందించడం సంతోషకరమని అన్నారు. గతంలో, నేడు చౌడమల సారయ్య వారి భార్య జ్ఞాపకార్థం హాకీ స్టిక్స్ పంపిణీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు, సీనియర్ క్రీడాకారులు శ్యామ్, రాజు, రాజేష్, సాయికృష్ణ, విక్రం, చౌడమల్ల భాను కిరణ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
క్రీడాకారులకు హాకీ స్టిక్స్ పంపిణీ చేస్తున్న అతిథులు, దాతలు..
Oplus_131072

క్రీడాకారులతో అతిథులు దాతలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!