Social 1080×1350 • Multi-page
18-05-2025 BREAKING NEWS 07:36 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ఎన్నిక… అధ్యక్షుడిగా హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మతిన్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నిక.

హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ఎన్నిక… అధ్యక్షుడిగా హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మతిన్, ఉపాధ్యక్షుడిగా యాదగిరి ఎన్నిక.
IMG_20250518_192609

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఎన్నికలకు ఎన్నికల అధికారులు రెండు బూత్ లు ఏర్పాటు చేయాగ, మొత్తం 926 ఓటర్లకు 607 ఓట్లు పోలయ్యాయి. పోలీస్ బందోబస్త్ మధ్య ఎన్నికలు స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో పోటాపోటీగా జరగగా ఎట్టకేలకు ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో నూతన పాలకవర్గం కోలువు తీరింది. ఈరోజు ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ముగ్గురు EC మెంబర్లకు ఉదయం నుంచి 11 గంటల వరకు నిర్వహించగా మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యక్షుడిగా కొమురవెల్లి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడుగా మండల యాదగిరి, కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి గతంలోనే ఏకగ్రీవం కావడంతో ఉత్కంఠగా సాగాల్సిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రధాన కార్యదర్శికి మక్కపల్లి రమేష్(230), బుర్ర కుమార్(97), MA మతీన్(250) పోలవగా మతిన్ 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా కుడికల ప్రభాకర్(290), కోట సంపత్(306) ఓట్లు రాగా నోటాకు 11 పోలయ్యాయి. 16 ఓట్ల మెజార్టీతో కోట సంపత్ గెలుపొందారు. అలాగే EC మెంబర్లుగా కుడికాల ప్రభాకర్(311), కoదల రమేష్(438), ముషం రాజేంద్రము(473), తేలుకుంట్ల వేణు(347) ఓట్లు పోలయ్యాయి. దీంతో ముగ్గురు గెలుపొందగా తక్కువ ఓట్లు వచ్చిన ప్రభాకర్ ఓడిపోయారు. ఈ పదవులకు పోటాపోటీగా ఓట్లు రావడంతో కౌంటింగ్ ముగిసేంతవరకు ఉత్కంఠ నెలకొంది. వారం రోజుల ఉత్కంఠకు నూతన పాలకవర్గం ఎన్నికతో ముగింపు పలికినట్లు అయింది. అధ్యక్షుడుగా కొమురవెల్లి హరిప్రసాద్, ఉపాధ్యక్షుడిగా మండల యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా ఎంఏ మతిన్, కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా కోట సంపత్, డైరెక్టర్లుగా ముషము రాజేంద్రము, కందల రమేష్, తేలుకుంట్ల వేణుల ఎన్నికతో వాకర అసోసియేషన్ నూతన పాలకవర్గం పూర్తిస్థాయిలో ఏర్పాటయింది. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణ కమిటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఇలాసాగరం వీరస్వామి, ఇతర ఎన్నికల అధికారులు గెలుపు పత్రాలను అందజేశారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులు స్వీట్లు పంపిణీ చేసి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గెలుపొందిన అభ్యర్థులకు మిత్రులు, శ్రేయోభిలాషులు, వాకర్స్ శుభాకాంక్షలు తెలిపారు.

వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కే హరిప్రసాద్..

Oplus_131072

ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మండల యాదగిరి..

ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎమ్ఏ మతిన్..

Oplus_131072

సంయుక్త కార్యదర్శి ఎన్నికైన కోట సంపత్..

Oplus_131072

కోశాధికారిగా ఎన్నికైన చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి..

డైరెక్టర్ లుగా ఎన్నికైన ముషము రాజేంద్రము..

కందల రమేష్..

తేలుకుంట్ల వేణు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!