Social 1080×1350 • Multi-page
19-05-2025 BREAKING NEWS 02:08 PM
swarnodayam.com
Telugu Daily News

దేశానికి అన్నం పెట్టే రైతులే ప్రమాదాలకు కారణం కావొద్దు….రైతులు రోడ్ల పైన ధాన్యం ఆరబోయకండి…రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు. -హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ

దేశానికి అన్నం పెట్టే రైతులే ప్రమాదాలకు కారణం కావొద్దు….రైతులు రోడ్ల పైన ధాన్యం ఆరబోయకండి…రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు. -హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ
IMG-20250519-WA0081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశానికే అన్నం పెట్టే రైతులు ప్రమాదాలకు కారణం కావద్దని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ రైతులను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సోమవారం హుజురాబాద్ లోని తన కార్యాలయంలో రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం వలన కలిగే ప్రమాదాలపై ఆయన మాట్లాడారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు ధాన్యం రోడ్లపై పోయకుండా సహకరించాలని ఆయన కోరారు. రోడ్లపై ధాన్యం విలువ చేయడంతో రాత్రి వేళలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే రోడ్లపై ఆరబోసిన ధాన్యంతో ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా గుర్తు చేశారు. సబ్ డివిజన్ పరిధిలో రైతులు కల్లాల వద్దే ధాన్యాన్ని ఆరపోసుకోవాలని సూచించారు. రోడ్లపై ధాన్యం నిల్వల వల్ల ప్రమాదాలు జరిగితే అనవసరంగా కేసుల పాలు అవుతారని హెచ్చరించారు. ఇకపై రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని ఆర బోయకూడదని, ఒకవేళ ఎవరైనా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే కేసులు కూడా పెడతామని తెలిపారు. రైతులపై పోలీసులకు చాలా గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని రైతులు కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!