19-05-2025 NORMAL NEWS 04:03 PM
swarnodayam.com
Telugu Daily News
19-05-2025 04:03 PM By Mandala Yadagiri

సామర్థ్య నిర్మాణంపై ఉపాధ్యాయులకు 5 రోజులు శిక్షణ

సామర్థ్య నిర్మాణంపై ఉపాధ్యాయులకు 5 రోజులు శిక్షణ
IMG_20250519_160051

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలో పనిచేస్తున్న LFL HMలు & SGT ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల ఇన్-సర్వీస్ శిక్షణ ఇవ్వనున్నట్లు మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈరోజు మండల వనరుల కేంద్రంలో శిక్షణకి రిసోర్స్ పర్సన్స్ తో ముందస్తు ప్రణాళిక వేసుకొని అంశాలను చర్చించారు.
ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు శిక్షణ లేదనీ, ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందన్నారు. పాల్గొనేవారి హాజరును తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ పర్యవేక్షిస్తుందనీ కాబట్టి చెక్ ఇన్ మరియు చెక్ అవుట్ సమయం చాలా ముఖ్యం అన్నారు. శిక్షణలు ఒకే దశలో నిర్వహించ బడతాయనీ, ఏ ఉపాధ్యాయునికీ మినహాయింపు లేదు అని అన్నారు. జూలై 2025 వరకు పదవీ విరమణ చేయబోయే ఉపాధ్యాయులకు శిక్షణ నుండి మినహాయింపు ఉందనీ, ఉపాధ్యాయులు తమ బోధనా సబ్జెక్టు యొక్క పాఠ్యపుస్తకాలను విధిగా తీసుకురావాల్సిందిగా అయన కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గాజుల ఆంజనేయులు, పత్తేo శ్రీనివాస్, ముశం సత్యరాజం, దానెంపల్లి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, తంగేళ్లపల్లి శ్రీనివాస్, దోమల సదానందం, సాహెదా సల్మా పాల్గొన్నారు.

Oplus_131072
రిసోర్స్ పర్సన్స్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈఓ శ్రీనివాస్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!