Social 1080×1350 • Multi-page
20-05-2025 BREAKING NEWS 12:23 PM
swarnodayam.com
Telugu Daily News

మే 22న జరిగే ” హిందూ ఏక్త యాత్ర” ను విజయవంతం చేయండి. – బీజేవైఎం రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు

మే 22న జరిగే ” హిందూ ఏక్త యాత్ర” ను విజయవంతం చేయండి. – బీజేవైఎం రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు
IMG-20250520-WA0038

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమాన్ జయంతి రోజున ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్ర నిర్వాహకులు, కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న ” హిందూ ఏక్తాయాత్ర ” ఈనెల 22న జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని హిందూ బంధువులు, బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సింగరాల రామరాజు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపు నిచ్చారు. ప్రప్రదమంగా కరీంనగర్లో పదేళ్ల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన హిందూ ఏక్తా యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు, ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున కరీంనగర్ పట్టణంలో అత్యంత వైభవంగా హిందూ ఏక్తాయాత్ర నేడు హిందువుల సంఘటితశక్తి కి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. 22న హనుమాన్ జయంతి రోజున హిందూ ఏక్తాయాత్ర మరింత వైభవంగా జరిగేలా తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ నుండి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభమై, పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగే యాత్ర కొనసాగుతుందని, రాజకీయాల కతీతంగా ప్రజలు, హిందూ ధర్మం గురించి ఆలోచించే సమాజం, యువత స్వచ్ఛందంగా యాత్రకు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

బీజేవైఎం రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!