Social 1080×1350 • Multi-page
20-05-2025 BREAKING NEWS 07:04 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి పరిశీలకుల పర్యటన… పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. – పీసీసీ పరిశీలకులు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నమిండ్ల శ్రీనివాస్, పిన్నింటి రఘునాథ్ రెడ్డి

హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి పరిశీలకుల పర్యటన… పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. – పీసీసీ పరిశీలకులు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నమిండ్ల శ్రీనివాస్, పిన్నింటి రఘునాథ్ రెడ్డి
IMG-20250520-WA0173

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీనీ సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాలు ఉపయోగపడతాయని కరీంనగర్ జిల్లా పీసీసీ పరిశీలకులు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నమిండ్ల శ్రీనివాస్, పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అధ్యక్షతన హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇళ్ళందకుంట మండలాల పరిధిలో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి కొండత బలమని, ఐక్యతతో పని చేసి విజయతీరాలకు చేరాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ప్రతి మండలాల్లో బ్లాక్ కాంగ్రెస్, మండల, పట్టణ, గ్రామ శాఖ అధ్యక్షుల కొరకు అభ్యర్తనలు తీసుకున్నామని, కిందిస్థాయిలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల, పట్టణ, అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

హుజురాబాద్ సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ పరిశీలకులు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నమిండ్ల శ్రీనివాస్, పిన్నింటి రఘునాథ్ రెడ్డి

Oplus_131072
Oplus_131072
ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితెల ప్రణవ్
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!