Social 1080×1350 • Multi-page
20-05-2025 BREAKING NEWS 08:49 PM
swarnodayam.com
Telugu Daily News

శిక్షణతో తరగతి గదిలో మార్పులు రావాలి

శిక్షణతో తరగతి గదిలో మార్పులు రావాలి
IMG_20250520_204624

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సామర్థ్య నిర్మాణాల పెంపు శిక్షణతో ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు బోధించే విధానంలో మార్పులు రావాలని హుజురాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని వాటికనుగుణంగా ఉపాధ్యాయులు పరిణితి చెందాలని అన్నారు శిక్షణ ద్వారా మరింత మెరుగైన విద్యను విద్యార్థులకు అందించవచ్చని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ గాజుల ఆంజనేయులు, పత్తేo శ్రీనివాస్, ముశం సత్యరాజం, దానెంపల్లి శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, తంగేళ్లపల్లి శ్రీనివాస్, దోమల సదానందం, సాహెదా సల్మా లు ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వారికి బోధనా సామర్థ్యాలపై పలు అంశాలను ఈ కార్యక్రమంలో సిఆర్పిలు గుండా రాజిరెడ్డి, రంగు దామోదరచారి, రవిబాబు, అమరేందర్, సుధామన్, మధు, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న అధికారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!