Social 1080×1350 • Multi-page
20-05-2025 BREAKING NEWS 09:51 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో అగ్నిప్రమాదం

హుజురాబాద్ లో అగ్నిప్రమాదం
IMG-20250520-WA0197

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ ప్రధాన జాతీయ రహదారిపై మంగళవారం హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ కార్ల రిపేర్ గ్యారేజ్ ప్రక్కన స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పరిసర ప్రాంతాల వారు తెలిపిన వివరాల ప్రకారం.. రహదారి పక్కన ఉన్న చెట్లకు నిప్పు అంటుకొని కాలిపోతుండగా స్థానికులు గమనించిన పలువురు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్ని ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో రహదారిపై ఉన్న చెట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఓ పాత కారు అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటనలో సుమారు పదివేల రూపాయల నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. కాగా పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమీపంలో ఉన్న పొలంలో కొయ్యకాలు అంటుపెట్టడంతోనే అగ్నిప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!