Social 1080×1350 • Multi-page
21-05-2025 BREAKING NEWS 01:30 PM
swarnodayam.com
Telugu Daily News

రాజీవ్ గాంధీ సేవలు ఎనలేనివి… కాంగ్రెస్ నేత ప్రణవ్.. ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

రాజీవ్ గాంధీ సేవలు ఎనలేనివి… కాంగ్రెస్ నేత ప్రణవ్.. ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.
IMG-20250521-WA0037
  • ఆయన సేవలు గుర్తు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు.
  • ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రణవ్.
  • మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్పనేత రాజీవ్ గాంధీ అని, దేశం కోసం వారి చేసిన సేవలు మరువలేనివని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని బస్ డిపో క్రాస్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రణవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చి అందరికీ విద్యను అందించారని, జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేశారని, ఇప్పటికీ టెక్నాలజీ వ్యవస్థ ముందుకు పోతుంది అంటే అది రాజీవ్ గాంధీ తీసుకున్న కృషి అని అన్నారు. దేశంలోని పరిశ్రమలకు రాయితీలను కల్పించి అనేక సంస్కరణలను తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, హుజురాబాద్ టౌన్, మండల అధ్యక్షులు మేకల తిరుపతి, కే కిరణ్, హుజురాబాద్ టౌన్, మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, వేముల పుష్పలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జీ రాజేశ్వరి -స్వామిరెడ్డి, డైరెక్టర్లు, హనుమాన్ దేవాలయ చైర్మెన్ శంకర్, డైరెక్టర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ వి విజయ్ కుమార్, చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు, దశరథం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవీందర్, సోషల్ మీడియా ఇంచార్జి ఏం రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పిస్తున్న ప్రణవ్
రాజీవ్ విగ్రహానికి

పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు

Oplus_131072
Oplus_131072
Oplus_131072

రాజీవ్ గాంధీ విగ్రహం ముందు నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!