21-05-2025 NORMAL NEWS 04:22 PM
swarnodayam.com
Telugu Daily News
21-05-2025 04:22 PM By Mandala Yadagiri

లారీ ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం..

లారీ ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం..
IMG_20250521_161607

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున స్కూటర్ ఇస్తాను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. టీఎస్ 02 ఈ వై 16 34 నెంబర్ గల స్కూటీపై వెళ్తున్న వ్యక్తి కరీంనగర్ కు చెందిన ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి శ్రవణ్ కుమార్(33) జమ్మికుంట రోడ్ సైడ్ తలకు హెల్మెట్ ధరించి వెళ్తుండగా వెనకాలే వచ్చినా డీబీఎల్ రోడ్ కంపెనీకి పనిచేసే టిప్పర్ లారీ టీజీ 08 యు 36 89 నంబర్ గల లారీ స్కూటరిస్ట్ ను ఢీకొట్టగా వెనక టైర్లు అతని నడుము, చెయ్యి పై నుండి వెళ్లడంతో కడుపులోని పేగులు బయటికి వెళ్లి, కిడ్నీలు పగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అంబేద్కర్ నడి చౌరస్తాలో జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమి గూడారు. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్సై, పోలీసులు లారీపై కేసు నమోదు చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి జేబులో ఉన్న సెల్ కి ఒక వ్యక్తి ఫోన్ చేయగా ఇతడు ఎవరు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని తెలుపగానే అతని పేరు కరీంనగర్ కు చెందిన శ్రావణ్ కుమార్ అంటూ రోదిస్తూ కాల్ కట్ చేశాడు. మృతదేహాన్ని అక్కడి నుండి తొలగించి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే స్కూటరిస్ట్ మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు.

Oplus_131072
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్కూటరిస్ట్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!