Social 1080×1350 • Multi-page
21-05-2025 BREAKING NEWS 11:19 PM
swarnodayam.com
Telugu Daily News

వైభవంగా రామాలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవం ప్రారంభం.

వైభవంగా రామాలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవం ప్రారంభం.
IMG-20250521-WA0134

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో పాతవాడలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట, ఉత్సవ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం బుధవారం వేద పండితులు ఆగమ శాస్త్ర ప్రకారం సాంప్రదాయ బద్ధంగా భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ప్రతిష్టను పునస్కరించుకొని బుధవారం దేవాలయంలో ఉదయం స్వామి వారికి పంచామృత అభిషేకం, యాగశాల ప్రవేశం, వాస్తు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు, ధ్వజస్తంభానికి జలదివాసం, క్షీరదివాసం కార్యక్రమంను శాస్త్రృత్తంగా వేద పండితులు చెరుకుపల్లి శ్రీధరాచార్యులు, రామాచార్యులు, రాఘవాచార్యులు,
నిఖిలాచార్యులు, లిఖిలాచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ క్యాస చక్రధర్, కమిటీ సభ్యులు ఆకుల సదానందం, బుర్ర నటరాజ్, గట్టు మహదేవ్,
కాసార్ల శ్రీహరి, యతిపతి అరుణ్ కుమార్, అకినేపల్లి శ్రవణ్,
క్యాస కమల్ కుమార్, చిదురాల నాగరాజు, కరుణ శ్రీ – కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో జరుగు ధ్వజస్తంభ పునప్రతిష్ట మరియు ఉత్సవిగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు విచ్చేయుచున్న శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ శ్రీమన్నారాయణ స్వామివారి రాకను పురస్కరించుకొని హుజరాబాద్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిలో యాజ్ఞకులు గోవర్ధనం రాఘవచార్యులు మరియు కందాలై రామాచారిల చేతుల మీదుగా శ్రీ చిన్న జీయర్ స్వామివారి కండువాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు యాగ్నికులు, భక్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!