Social 1080×1350 • Multi-page
22-05-2025 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి,వరంగల్ జిల్లా, మే 22: తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం ప్రారంభించారు. అమృత్ భారత్ స్కీములో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్, రైల్వే స్టేషన్ ను గురువారం పునర్: ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రీ డెవలప్ చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేశారు. రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని దేశవ్యా ప్తంగా అన్ని స్టేషన్లను ఒకేసారి వర్చువల్ గా ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 25..41 కోట్ల నిధులతో అమృత భారత్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంతర్జా తీయ ప్రమాణాలకు దీటు గా వరంగల్ రైల్వే స్టేషన్ రూపుదిద్దారు. కాకతీయుల కలలు. స్టేషన్లో ప్రయాణికు లను ఆకట్టుకున్నాయి.

ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీని వాస్ వర్మ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఇతర రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ గళ్ళ అరుణ, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, తోపాటు శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్, ఏసీ ఎమ్ శ్రీరామ్ మూర్తి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభిస్తున్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!