22-05-2025 NORMAL NEWS 10:01 PM
swarnodayam.com
Telugu Daily News
22-05-2025 10:01 PM By Mandala Yadagiri

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గా నారాయణరెడ్డి… హైదరాబాద్ కమిషనరేట్ కు రాజేందర్ రెడ్డి అటాచ్.

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గా నారాయణరెడ్డి… హైదరాబాద్ కమిషనరేట్ కు రాజేందర్ రెడ్డి అటాచ్.
IMG-20250522-WA0139

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ నారాయణరెడ్డి నియామకమయ్యారు. ఇప్పటివరకు సూపరిండెంట్ గా ఉన్న డాక్టర్ రాజేందర్ రెడ్డిని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ కు అటాచ్ చేసినట్లు తెలిసింది. రాజేందర్ రెడ్డి సూపరింటెండెట్గా సుమారు గత మూడేళ్లుగా కొనసాగారు. అత్యధిక రోజులు సూపర్డెంట్ గా పనిచేసిన రాజేందర్ రెడ్డి పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రి నిర్వహణ గురించి సక్రమంగా పట్టించుకోడని, సిబ్బందిపై అజమాయిషి ఉండేది కాదని, ఆర్ ఎంఓ సుధాకర్ రావు హవానే కొనసాగేదని ఆరోపణలు ఉన్నాయి. రాజేందర్ రెడ్డి ఆసుపత్రి నిర్వహణ నిధులు, సిబ్బంది విధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడని ఆరోపణలు కలవు. ఇటీవల ఏరియా ఆసుపత్రిలోని అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆస్పత్రికి వచ్చే పేషంట్లను ప్రైవేటు ఆసుపత్రులకు రేఫర్ చేస్తున్నారని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో మిలాఖత్, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెళ్ళు వేత్తడంతో పాటు సూపరిండెంట్ గా విఫలమయ్యాడన్న కారణంతో హైదరాబాద్ కమిషనరేట్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఏరియా ఆసుపత్రిలో సీనియర్ మత్తు వైద్యుడిగా, సెకండ్ ఆర్ఎంవో గా కొనసాగుతున్న నారాయణ రెడ్డిని సూపరింటెండెంట్ గా నియమించడం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. డాక్టర్ నారాయణ రెడ్డి సూపర్డెంట్ గా నియమించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.

నూతన సూపరిండెంట్ గా నియామకమైన డాక్టర్ నారాయణరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!