Social 1080×1350 • Multi-page
23-05-2025 BREAKING NEWS 05:47 PM
swarnodayam.com
Telugu Daily News

కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు ఘన సన్మానం

కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు ఘన సన్మానం
Oplus_131072

ముఖ్య అతిథులుగా పాల్గొన్న హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్, టాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని స్థానిక న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో గ్లోబల్ ఫోటోకాన్ కరాటే డు అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో బెల్ట్ మెరిట్ టెస్టులో కరాటే విద్యార్థులు విజయం సాధించిన సందర్భంగా విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, బెల్ట్ మెరిట్ టెస్టులలో విజయం సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరాటేను తన వృత్తిగా ఎంచుకొని ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతు వారి భవిష్యత్తుకు మంచి పునాది వేస్తున్న కృషీవలుడు కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. కరాటే విద్యార్థులను మానసికంగా పరిపక్వత చెందునట్లు చేయడమే కాకుండా శారీరకంగా దృఢ పరుస్తుందని, అదేవిధంగా కరాటే పిల్లలలో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తూ వారు సమాజంలోని ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ముందడుగు వేస్తూ తమను తాము రక్షించుకోవడానికి కరాటే దోహదపడుతుందని వారు విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండా గణేష్, అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎండి ఖలీద్ హుస్సేన్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపాల్ పెండ్యాల రాజిరెడ్డి, కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అంబాల ప్రభాకర్ , బి రాజ్ కుమార్, టి గోపాల్, కరాటే మాస్టర్లు ఎస్కే జానీ, శ్రీనాథ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

బెల్టులు, సర్టిఫికెట్లతో కరాటే విద్యార్థులు..
విద్యార్థికి సర్టిఫికెట్, బెల్టును ప్రధానం చేస్తున్న అతిథి జనార్ధన్
కార్యక్రమంలో మాట్లాడుతున్న రూరల్ సిఐ పులి వెంకట్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!