Social 1080×1350 • Multi-page
23-05-2025 BREAKING NEWS 06:55 PM
swarnodayam.com
Telugu Daily News

చత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లను సిట్టింగు జడ్జిచే విచారణ జరిపించాలి.

చత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లను సిట్టింగు జడ్జిచే విచారణ జరిపించాలి.
IMG-20250523-WA0091

ఆపరేషన్ కగారును నిలిపివేయాలి శాంతి చర్చలు కొనసాగించాలి... – ముక్కెర రాజు,
తె.జ. స.రాష్ట్ర కార్యదర్శి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో 01.01.2023 నుండి నేటి వరకు 486కు పైగా అమాయక ఆదివాసులు మరియు మావోయిస్టులను ఎన్కౌంటర్ రూపంలో కాల్చి వేయబడ్డారనీ అవి అమాయక ప్రజలపై సామూహిక హత్యాకాండ అని మనందరికీ తెలిసిందేనన్నారు తె.జ. స.రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు. శుక్రవారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. దేశం ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం అని, పెద్ద రాజ్యాంగం, రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం పరమైన మరియు చట్టపరమైన విధంగా పాలన ఉండాలని, అందులో ప్రధానమైనది జీవించే హక్కు ఆర్టికల్ 21 కల్పించబడినదన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా అప్రజా స్వామికంగా ఎన్కౌంటర్ రూపంలో చంపుతున్నారని దీనిని ప్రజలు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, సామాజికవేత్తలు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఒకవైపు మావోయిస్టు పార్టీ తను కాల్పులను విరమిస్తూ శాంతి చర్చలకు సిద్ధమని అనేక పర్యాయాలు లేఖలు మరియు వీడియోల ద్వారా విజ్ఞప్తి చేసిన కానీ కేంద్ర ప్రభుత్వం అందరిని విజ్ఞప్తిని మేధావుల శాంతి చేర్చిన కమిటీ ప్రతిపాదనలను విస్మరిస్తూ నేటికీ కగార్ పేరుతో హత్యాకాండ కొనసాగిస్తున్నదన్నారు. ఇందులో భాగంగా 21- 5- 2025 రోజున చత్తీస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 28 మంది ఎన్కౌంటర్ల రూపంలో హత్యగావించబడ్డారన్నారు.

ఇవి ఎన్కౌంటర్ కాదు ఏకపక్షంగా పట్టుకొని కాల్చి చంపినట్లుగా అర్థమవుతున్నదన్నారు. ఇటు ఎన్కౌంటర్లను సిట్టింగ్ జడ్జిచే న్యాయచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కెర రాజు తె.జ. స.రాష్ట్ర కార్యదర్శి, వేల్పుల రత్నం, డి.టి.ఎఫ్ సీనియర్ నాయకులు, తునికి సమ్మయ్య అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి, పసుల స్వామి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి, సందెల వెంకన్న బీసీ రాష్ట్ర నాయకులు, అన్నాడి సత్తిరెడ్డి భారత్ బచావో నాయకులు, ములుగు రమేష్ బీఎస్పీ జిల్లా నాయకులు, వేల్పుల ప్రభాకర్ రిటైర్డ్ ఆర్టీసీ రాష్ట్ర నాయకులు, కొల్లూరి బుచ్చయ్య సగర సంగం గ్రామ అధ్యక్షుడు, గడ్డం సంజీవ్ సిఎల్సి జిల్లా సహాయ కార్యదర్శి, ఎనగందుల కిష్టయ్య రైతాంగ సమితి జిల్లా నాయకులు, గజ వెళ్లి మురళి ఏబిఎంఎస్ నాయకులు, పెట్టెం కుమారస్వామి టీపీఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు, కొత్తూరి ఇంద్రసేన ఆదివాసి సంఘీభావ వేదిక కో కన్వీనర్ వరంగల్ హనుమకొండ, కొత్తూరు రమేష్ సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫౌండర్, గొల్లూరి ప్రవీణ్ కుమార్ టిపిఎఫ్ వరంగల్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎండి మహమ్మద్ బాబర్ హుజురాబాద్ టౌన్ నాయకులు, అన్ని ప్రజాసంఘాలు, మరియు హక్కుల సంఘాలు, మేధావులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

దళిత ప్రజా సఘాల నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ముక్కెర రాజు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!